Janasena Meeting: టీడీపీతో పొత్తు ప్రకటన తర్వాత జరుగుతున్న కీలక సమావేశం
Janasena Meeting: కాసపట్లో జనసేన విస్తృతస్థాయి సమావేశం
Janasena Meeting: వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. ఉమ్మడి కార్యాచరణ రెడీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
అమరావతిలో ఇవాళ జనసేన కీలక సమావేశం నిర్వహించనుంది. మధ్యాహ్నం జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, మహిళా సమన్వయకర్తలు, అధికార ప్రతినిధులు, సంయుక్త కార్యదర్శులు పాల్గొననున్నారు.
టీడీపీతో పొత్తు తర్వాత జరుగుతున్న కీలక సమావేశం కావడంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. మరో వైపు బీజేపీతో పొత్తు కొనసాగుతుందా లేదా అనే దానిపై సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీడీపీతో క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు జనసేన క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు పవన్‌కల్యాణ్. భవిష్యత్ కార్యాచరణను కూడా కార్యకర్తలకు వివరించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
ఇక టీడీపీ, జనసేన జాయింట్ యాక్షన్ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారనే దానిపైనా ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయిన నేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎవరు..?. సీట్ల కేటాయింపు వంటి అంశాలకు సంబంధించి పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన నేతలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు. ఎంత బలం ఉందనే అంశానికి సంబంధించి శనివారం జరగనున్న విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలతో పవన్ చర్చించే అవకాశం కనిపిస్తోంది.