Astroid approaching the earth: భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం!
Astroid approaching the earth: 2020ND పేరుతో 160 మీటర్ల వ్యాసార్థం తో ఉన్న గ్రహశకలం భూమివైపు దూసుకోస్తోంది.
అసలే కరోనాతో వణుకుతున్న ప్రజలకు నాసా మరో పిడుగులాంటి వార్త చెప్పింది. సాధారణంగా గ్రహశకలాలు భూమి వైపు దూసుకు వస్తుంటాయి. ఇవి భూకక్ష్యకు దూరంగా పక్క నుంచి వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఆదివారం కూడా రెండు చిన్న చిన్న గ్రహశకలాలు భూఒమి పక్కగా దూసుకు వేల్లబోతున్నాయి. ఈ నేపధ్యంలో నాసా ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పింది. 2020ND పేరుతో 160 మీటర్ల వ్యాసార్థం తో ఉన్న గ్రహశకలం భూమివైపు దూసుకోస్తోంది. ఇది భూమికి కొంచెం దగ్గరగా ఈ నెల 24 వ తేదీకి వస్తుంది. ప్రస్తుతం ఇది భూమికి సుదూరంగా కదిలిపోతోంది. మార్గంలో వెళ్ళిపోతే భూమికి వచ్చే ప్రమాదం ఏమీలేదని నాసా చెప్పింది. అయితే, దాని దిశలో మార్పు వస్తే ఇబ్బందే నని నాసా చెబుతోంది.