Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన బాలుడి హెల్త్ కండిషన్ ఎలా ఉందంటే..
Health condition of boy injured in Sandhya theatre stampede: పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడైన 9 ఏళ్ల శ్రీతేజ్ కూడా ఈ ఘటనలో గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్, బెయిల్ పై విడుదల నేపథ్యంలో మరోసారి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వార్తల్లోకెక్కింది. చాలామంది నెటిజెన్స్ ఆ బాలుడి ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తంచేయడం కనిపించింది. ఇంకొంతమంది అసలు బాలుడు ఎక్కడ చికిత్స పొందుతున్నాడో, ఏం జరుగుతుందో కూడా బయటికి రావడం లేదని అనుమానాలు వ్యక్తంచేశారు.
తాజాగా బాలుడికి చికిత్స అందిస్తున్న సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ బాలుడి హెల్త్ కండిషన్ వివరాలు వెల్లడించారు.
బాలుడికి వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు కిమ్స్ డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతానికి బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. ట్యూబ్‌ను లోపలికి పంపించి ఆహారం అందిస్తున్నట్లు చెప్పారు. తాజాగా సెన్సోరియం ద్వారా బాలుడిలో కదలికలను గుర్తిస్తున్నట్లు డాక్టర్స్ చెప్పుకొచ్చారు. బాలుడి ఆరోగ్యం, చికిత్స విషయంలో వస్తోన్న పుకార్లకు చెక్ పెట్టేందుకే అల్లు అర్జున్ పీఆర్ టీమ్ ఈ వివరాలు వెల్లడించడంలో చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్, కేసుకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ కింది వీడియో చూడండి.
Allu Arjun Arrest: అల్లు అర్జున్‌పై కేసు ఏంటి.. దానికి శిక్ష ఏంటి?
Tollywood Controversies in 2024: సినిమా సెలెబ్రిటీలకు చుక్కలు చూపించిన 2024
Mohan Babu Family Crisis: మోహన్ బాబు ఇంట్లో అసలు గొడవేంటి?