Allu Arjun Arrest: అల్లు అర్జున్ విడుదల విషయంలో తప్పని సస్పెన్స్
Why Allu Arjun's release from Chanchalguda jail was delayed? అల్లు అర్జున్ విడుదల కోసం చంచల్ గూడ జైలు వద్ద వేచిచూసిన అల్లు అరవింద్.. చివరకు నిరాశతోనే అక్కడి నుండి వెళ్లిపోయారు. దీంతో ఈ రాత్రికి అల్లు అర్జున్ ఇక జైలులోనే ఉండక తప్పదని తెలుస్తోంది.
Why Allu Arjun's release from Chanchalguda jail was delayed? అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుండి రిలీజ్ అవడంలో అభిమానులకు ఎదురుచూపులు తప్పడం లేదు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకే తెలంగాణ హై కోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. జైలు సూపరింటెండెంట్ కు రూ. 50 వేల పూచీకత్తును సమర్పించాల్సిందిగా కోర్టు షరతు విధించింది. నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ కు సంబంధించిన రెగ్యులర్ బెయిల్ కోసం ఆ కోర్టునే ఆశ్రయించాల్సిందిగా సూచించింది.
అయితే కోర్టు వైపు నుండి బెయిల్ కాపీలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అవలేదని తెలుస్తోంది. దీంతో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు షురిటీ కాపీలు సిద్ధం చేసుకుని జైలు వద్ద వేచిచూస్తున్నప్పటికీ బెయిల్ కాపీలు అందుబాటులోకి రాకపోవడంతో వారు జైలు బయటే వేచిచూస్తూ ఉన్నారు.
మరోవైపు రాత్రి 10 గంటల వరకు తాను చంచల్ గూడ జైలు వద్ద ఉంటానని, ఆ తరువాత విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోతానని జైలు సూపరింటెండెంట్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాత్రి 10 దాటిపోయింది. దాంతో ఇప్పటికి ఇప్పుడు బెయిల్ కాపీలు వచ్చినా.. లోపల జైలు సూపరింటెండెంట్ అందుబాటులో ఉంటారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అల్లు అర్జున్ విడుదల కోసం చంచల్ గూడ జైలు వద్ద వేచిచూసిన అల్లు అరవింద్.. చివరకు నిరాశతోనే అక్కడి నుండి వెళ్లిపోయారు. దీంతో ఈ రాత్రికి అల్లు అర్జున్ ఇక జైలులోనే ఉండక తప్పదని తెలుస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ కోసం చంచల్‌గూడ జైలులో క్లాస్ 1 బ్యారక్‌లో సెల్ సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది. ఒకవేళ శుక్రవారం రాత్రి అల్లు అర్జున్ జైలులోనే ఉండాల్సి వస్తే... రేపు శనివారం ఉదయం కూడా అన్ని ఫార్మాల్టీస్ పూర్తి చేసుకుని, ఆయన జైలు నుండి విడుదలయ్యేటప్పటికి 11 నుండి మధ్యాహ్నం 12 గంటల సమయం అయ్యే అవకాశం ఉంది. Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్, మధ్యంతర బెయిల్‌పై రిలీజ్.. ఈ కేసులో నేరం రుజువైతే ఎంత కాలం శిక్ష పడుతుంది? ఈ కింది వీడియో చూడండి.