Telangana: ఎంపీ అర్వింద్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

Telangana: మతం పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేయడం దారుణమని వైఎస్‌ షర్మిల అన్నారు.

Update: 2021-03-26 11:36 GMT

Telangana: ఎంపీ అర్వింద్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

Telangana: మతం పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేయడం దారుణమని వైఎస్‌ షర్మిల అన్నారు. భైంసా అల్లర్లకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. రాజకీయాల కోసం సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ లోటస్‌ పాండ్‌లో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లా వైఎస్‌ అభిమానులతో భేటీ అయిన షర్మిల పలు అంశాలపై వారితో చర్చించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లకు అన్యాయం జరిగిందన్నారు.

పసుపు బోర్డు పేరుతో నిజామాబాద్‌ ప్రజలను ఎంపీ అర్వింద్‌ దగా చేశారని విమర్శించారు. ఎన్ని ఉద్యమాలు చేసినా పసుపు రైతుల బాధలు తీరలేదన్నారు. రాజన్న సంక్షేమ పాలన కోసం పోరాడుతానని షర్మిల హామీ ఇచ్చారు. నిజాం షుగర్ ప్రాజెక్ట్ ను నడిపించే విధంగా వైఎస్సార్ ఆనాడు కేంద్రాన్ని సైతం ఒప్పించారన్నారు. బాసర లో ట్రిపుల్ ఐటీ, నిజామాబాద్ లో యూనివర్సిటీ వైఎస్సార్ ఏర్పాటు చేశారన్నారు. జల్ జమీన్ జంగల్ పేరుతో నిజాంకి చుక్కలు చూపిన కొమురం భీం పుట్టిన గడ్డ అదిలాబాద్ అని అన్నారు. మంత్రి పదవికి రాజీనామ చేసిన కొండా లక్ష్మణ్ ది.. ఉద్యమాన్ని ముందుండి నడిపిన కోదండ రామ్ పుట్టిన గడ్డ అదిలాబాద్ అని కొనియాడారు. 

Tags:    

Similar News