తృటిలో తప్పిన మరో పరువు హత్య.. బావ‌ను చంపేందుకు క‌త్తితో కోర్టులోకి..

Rangareddy Court: పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో మరో పరువు హత్య తృటిలో తప్పింది.

Update: 2022-05-25 11:09 GMT
Youth Enter in Rangareddy Court With Knife

తృటిలో తప్పిన మరో పరువు హత్య.. బావ‌ను చంపేందుకు క‌త్తితో కోర్టులోకి.. 

  • whatsapp icon

Rangareddy Court: పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో మరో పరువు హత్య తృటిలో తప్పింది. అక్కను ప్రేమంచిన వ్యక్తిని చంపేందుకు ఓ యువకుడు ఏకంగా రంగారెడ్డి కోర్టులోకే ప్రవేశించాడు. అయితే భద్రతా సిబ్బంది అలర్ట్‎గా ఉండడంతో గండం గడచింది. గతేడాది మియాపూర్ కి చెందిన ఒక యువతి తన క్లాస్‎మేట్ అయిన అక్బర్ ని ప్రేమించి ఉప్పల్ చెంగిచర్లలోని ఆర్యసమాజ్ లో వివాహం చేసుకుంది. అనంతరం కుటుంబ కలహాలతో మూడు నెలల క్రితం డైవోర్స్‎కి అప్లయి చేసుకున్నారు.

అయితే అమ్మాయి తమ్ముడు సాయికిరణ్ మాత్రం అక్బర్‎పై కోపం పెంచుకున్నాడు. ఇవాళ కోర్టుకు హాజరవుతున్న విషయం తెలుసుకొని నడుములో కత్తి పెట్టుకుని తన మిత్రునితో కలిసి కోర్టులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అయితే సాయికిర‌ణ్ క‌త్తి ప‌ట్టుకుని తిర‌గ‌డాన్ని సెక్యూరిటీ సిబ్బంది ప‌సిగ‌ట్టారు. దీంతో అత‌న్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News