HYD New Voters: కొత్త ఓటర్... తీర్పు..?
HYD New Voters: పూర్తిగా యువతతో నిర్వహించనున్న పోలింగ్ కేంద్రం
HYD New Voters: ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు తొలి ఓటర్లు ఎదురుచూస్తున్నారు. గతంతో పోలిస్తే.. వీరి సంఖ్య భారీగా ఉందని గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఓటరు నమోదుపై.. కాలేజీల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో సంఖ్య పెరిగినట్టు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో కొత్త ఓటర్ల తీర్పు ఎటువైపు ఉండనుందనే ప్రశ్న పార్టీలతోపాటు అభ్యర్థులను తీవ్రంగా తొలిచేస్తోంది.
యువతను ఆకర్షించేందుకు హైదరాబాద్ జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున యూత్ థీమ్‌తో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 15 పోలింగ్ కేంద్రాలను పూర్తిగా యువతతో నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో ఓటర్లు సంఖ్య ఈసారి భారీగా పెరిగింది. ఈసారి ఏకంగా లక్షమందికి పైగా ఓటర్లు ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. GHMC పరిధిలోని 24 నియోజకవర్గాల్లో మొత్తం కోటి 9లక్షల 56వేల 477 మంది ఓటర్లు ఉన్నారు. కేవలం GHMC పరిధిలోనే 92 లక్షల 50వేల 951 ఓటర్లు ఉన్నారు. వీరికి రంగారెడ్డి జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలు, మేడ్చల్ కలుపుకొంటే ఓటర్ల సంఖ్య కోటి 9లక్షల 56వేల 477కి చేరింది.
తుది ఓటరు జాబితా ప్రకారంగా 24 నియోజకవర్గాల్లో అత్యధికంగా శేరిలింగంపల్లిలో 73వేల 2587 ఓటర్లుగా మొదటి స్థానంలో నిలిచింది. అత్యల్పంగా చార్మినార్ నియోజకవర్గంలో 2లక్షల 26వేల 117 మంది ఓటర్లు ఉన్నారు. కాగా థర్డ్‌జెండర్‌లు 11వందల 70 మంది ఉండగా.. ఎన్నారైలు, సర్వీస్ ఓటర్లు ఇతరుల జాబితాలో ఉన్నారు.
మహానగర పరిధిలోని కోటి తొమ్మిది లక్షలకు మందికి పైగా ఓటర్లు ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోనున్నారు. ఈ మేరకు ఈ నెల 15వ తేదీ నుంచి ఎన్నికల విభాగం అధికారులు ఓటర్ స్లిప్‌లను పంపిణీ చేస్తున్నారు. జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త ఓటర్లు ఓటు హక్కును వినియోగించేందుకు పోలింగ్ స్టేషన్‌కు వచ్చేలా.. ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.