Weather Update: తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Weather Update: భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ

Update: 2024-09-05 16:30 GMT

Weather Update: తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Weather Update: పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి అనుబంధ ఆవర్తనం సముద్రమట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించిందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో గురువారం నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు, అదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ వాఖ వెల్లడించంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు.

Tags:    

Similar News