Women and child welfare: సమాజిక మాధ్యమంగా మహిళలకు సలహాలు.. మహిళా, శిశు సంక్షేమశాఖ ఏర్పాట్లు

Woman and child welfare: ఒక పక్క కరోనా వైరష్ వ్యాప్తి, మరో పక్క ఇప్పటికీ తెరుచుకోని అంగన్వాడీలు, మరో పక్క తెరుచుకున్నా సేవలకు దూరంగా ఆస్పత్రులు.

Update: 2020-09-03 03:24 GMT

Government of Telangana Logo (File image)

Woman and child welfare: ఒక పక్క కరోనా వైరష్ వ్యాప్తి, మరో పక్క ఇప్పటికీ తెరుచుకోని అంగన్వాడీలు, మరో పక్క తెరుచుకున్నా సేవలకు దూరంగా ఆస్పత్రులు వెరసి మహిళా శిశు సంక్షేమ శాఖ కొత్త తరహా విధానానికి తెరతీసింది..మహిళలు, శిశువుల ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు, సూచనలు అందించేందుకు సామాజిన మాధ్యామాలను దికగా చేసుకుంది. భవిషత్తులో దీనిని మరింత విస్తరించి, సాధారణ సమయాల్లో సైతం ఈ విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఈ సూచనలేమిటనుకుంటున్నారా...? అవేనండీ.. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ట్విట్టర్, ఫేస్‌బుక్‌ పేజీలో ఇస్తున్న సందేశాలు, సూచనలివి. మహిళలు, శిశువుల ఆరోగ్యం ప్రచారానికి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుం ది. ఈ దిశగా ఆ శాఖ వినూత్న ప్రచా రానికి తెరలేపింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో నేరుగా ఇచ్చే సలహాలు, సూచనలతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం కల్పిస్తోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు ప్రత్యేక పేజీలున్నాయి. వీటికి వేలసంఖ్యలో ఫాలోవర్లూ ఉన్నారు.

స్మార్ట్‌గా సలహాలు...

స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరుగుతుండటంతో అందుకు తగినట్లుగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అవగాహన కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల ద్వారా కార్యక్రమాలు ప్రారంభించింది. రెండేళ్ల క్రితమే ఈ ఖాతాలు తెరిచినప్పటికీ... లాక్‌డౌన్, అనంతర పరిస్థితుల నేపథ్యంలో వీటిపై విస్తృత ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించిన అంశాలే లక్ష్యంగా ఈ ప్రచారం చేపట్టింది. మహిళలు తీసుకునే ఆహారం మొదలు, ఆరోగ్య స్థితి, సమస్యలు, వాటికి సమాధానాలు ఇస్తూ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో అంగన్‌వాడీలకు వచ్చే లబ్ధిదారులతో సలహా లిప్పిస్తున్నారు. వారి వ్యక్తిగత అనుభవాలతో కూడా వీడియోలు తీసి ట్విట్టర్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

ఫాలోవర్స్‌ లిస్టులో నీతి ఆయోగ్‌...

రాష్ట్రంలో 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. తాజాగా ప్రతి జిల్లాలో జిల్లా సంక్షేమాధికారి ట్విట్టర్, ఫేస్‌బుక్‌ ఖాతాను తెరిచారు. ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో సీడీపీవోలు కూడా ఇదే తరహాలో ఖాతాలు తెరిచి ఫాలో అవుతున్నారు. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఖా తాను కేంద్ర మహిళాభివృద్ధి శాఖ, నీతి ఆయో గ్‌ సైతం ఫాలో అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పోస్టులకు అవి లైక్‌ కొట్టడం, షేర్‌ చేయడంతోపాటు అభినందిస్తుండటం గమనార్హం. 

Tags:    

Similar News