Mallu Bhatti Vikramarka: బౌద్ధస్థూపాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాం
Mallu Bhatti Vikramarka: ప్రభుత్వానికి టూరిజాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంది
Mallu Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ మహాస్థూపాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యానమందిరం, బౌద్ధ మహాస్థూపాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలసి భట్టి పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయి పర్యటకులను నేలకొండపల్లి ఆకర్షిస్తోందని, టూరిజం అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. టూరిజం, ఆర్కియాలజీ రెండు శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు.