Cold wave: తెలంగాణను వణికిస్తున్న చలి..పొంచి ఉన్న వైరల్ వ్యాధులు..ఈ జాగ్రత్తలు తీసుకోండి
Cold wave: తెలంగాణను చలి వణికిస్తోంది. చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. మొన్నటి వరకు నార్మల్ టెంపరేచర్లు ఉండగా.. ప్రస్తుతం సింగిల్ డిజిట్ కి పడిపోతున్నాయి. 15 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం ఎనిమిది దాటినా చలి ఏమాత్రం తగ్గడం లేదు. చలి తీవ్రతను తట్టుకునేందుకు పగలు, రాత్రి లేకుండా స్వెటర్లు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతకు పడిపోతుండడంతో చాలా జిల్లాలు ఆరెంజ్ అలెర్ట్ లిస్టులో కొనసాగుతున్నాయి.
శుక్రవారం రాత్రి రాష్ట్రంలోని అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్ లో ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కుమురం భీం జిల్లాలోని సిర్పూర్ లో 6.1డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ 6.3 డిగ్రీల సెల్సియస్ 7.3 డిగ్రీల సెల్సియస్, మల్ చెల్మా 7.5 డిగ్రీ సెల్సియస్ నల్లవల్లి 7.7 ఆల్గల్ 7. 7 లక్ష్మీసాగర్, బీహెచ్ఈఎల్ 8.2 మొగుడంపల్లి నిజాంపేట్ ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువ గానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాతో పాటు సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెబుతున్నారు. ఉదయం పూట 30 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల దిగువ కనిష్ట ఉష్ణోగ్రత నమోదయితాయని అధికారులు వెల్లడించారు . ఈ మేరకు అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.
చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పలు రకాల వైరల్ వ్యాధులు, అలర్జీలతో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామందిలో అలర్జిక్ రైనైటీస్ దాడి చేస్తోందని వైద్యులు కూడా చెబుతున్నారు .జలుబు, పొడి దగ్గు, ముక్కు కారటం, తుమ్ములు, కళ్ళ నుంచి నీరు కారటం, దురద లక్షణాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
చల్లని గాలి, పొడి వాతావరణం వల్ల గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం పొడి పారిపోతుందని.. చర్మం తాజాగా ఉండటానికి మాశ్చరైజర్లు రాసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో దాహం వేయడం చాలా మంది నీళ్లు తాగరు. తద్వారా యూరిన్ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. దాహం లేకపోయినా రోజుకు 8 గ్లాసుల వరకు నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. అధిక చలిలో ముక్కు, చెవిలో ఇన్ఫెక్షన్లు పెరుగుతాయని ఉదయం వాకింగ్ వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.