CMR College Girls Hostel: గల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల కేసులో ఇద్దరు అరెస్ట్
CMR College Girls Hostel Incident: సీఎంఆర్ కాలేజ్ గల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల కేసులో ఇద్దరు అరెస్ట్
Hidden cameras in CMR College Girls Hostel: మేడ్చల్ సమీపంలోని కండ్లకోయ వద్ద ఉన్న సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గల్స్ హాస్టల్ బాత్రూమ్లలో రహస్య కెమెరాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇదే కాలేజీలో పనిచేస్తోన్న ఇద్దరు బీహార్ వర్కర్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో A1 నంద కిషోర్ కుమార్, A2 గోవింద్ కుమార్ ఉన్నారు.
ఈ ఘటనపై ఇప్పటికే బీఎన్ఎస్ సెక్షన్స్ 77, 125, 49, 239 కింద కేసు నమోదైంది. పోక్సో చట్టంలోని సెక్షన్ 11, 12, 16, 17 కింద కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో సీఎంఆర్ కాలేజ్ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డి సహా మొత్తం ఏడుగురి పేర్లను నిందితులుగా చూపించారు.
A1 నంద కిషోర్ కుమార్, A2 గోవింద్ కుమార్ ల తరువాత A3 కింద ధనలక్ష్మి, A4 కింద అల్లం ప్రీతిరెడ్డి, A5 గా కాలేజ్ ప్రిన్సిపల్ అనంత నారాయణ, A6 గా కాలేజ్ డైరెక్టర్ మద్దిరెడ్డి జగన్ రెడ్డి ఉన్నారు.