Ration Card: పేదవారికి భారీ శుభవార్త..జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు
Ration Card: రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న మధ్య తరగతి, పేద కుటుంబాలకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వున్నట్లు సీఎం కీలక ప్రకటన చేశారు. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు రాలేదు. దాంతో లక్షల మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తునే ఉన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేద, మధ్య తరగతి ప్రజలు లక్షల దరఖాస్తులు పెట్టుకున్నారు. కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో సభల్లో చెప్పినట్లుగానే ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ చేయడంతోపాటు మహిళల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల కోసం సర్వేలు కూడా చేసింది. పండగలోపు మరిన్ని శుభవార్తలు వింటారంటూ అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు.
అనుకున్న విధంగానే తెలంగాణ మంత్రి వర్గ మీటింగ్ లో ప్రస్తుతం ఉన్న తాజాగా పరిస్థితులపై చాలా సేపు చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ పర్యాటకం వంటి కీలక అంశాలను చర్చింాచరు. వాటిని ఎలా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల సలహాలు, సూచనలను తీసుకున్నారు. తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణలో పేదల బతుకులు మార్చే పనిలో మేము నిమగ్నం అయ్యామన్నారు. నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 26వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ చేపడుతున్నట్లు తెలిపారు.
సీఎం ప్రకటనతో పేద, మధ్యతరగతిప ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేషన్ కార్డులు చాలా అవసరం. ప్రభుత్వం ఇచ్చే అన్ని స్కీములకు ఆధార్ తోపాటు రేషన్ కార్డు కూడా చాలా కీలకం. అలాగే వైద్యం కోసం కూడా రేషన్ కార్డు ఉంటే లక్ష రూపాయల వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించే అవకాశం ఉంటుంది.