Kishan Reddy: ప్రచారంలో కమల సారధి కిషన్‌రెడ్డి ఎక్కడ..?

Kishan Reddy: బీజేపీకి వచ్చిన వేవ్‌ను కంటీన్యూ చేయడంలో కిషన్‌రెడ్డి ఫెయిల్..!

Update: 2023-11-22 09:52 GMT

Kishan Reddy: ప్రచారంలో కమల సారధి కిషన్‌రెడ్డి ఎక్కడ..?

Kishan Reddy: తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. గెలుపు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు.. తీవ్రంగా శ్రమిస్తున్నారు. గులాబీ అధిపతి కేసీఆర్, పీసీపీ చీఫ్ రేవంత్‌ రెడ్డి తెలంగాణ అంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోజుకు సాధ్యమైనంత ఎక్కువగా బహిరంగ సభలతో జనాల్లో ఉండేలా చూసుకుంటున్నారు. కానీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పాత్ర మాత్రం పరిమితం గానే ఉందని చెప్పాలి. ఎన్నికల క్యాంపెయిన్‌లో కిషన్ రెడ్డి హడావుడి పెద్దగా కనిపించడం లేదు.

కేవలం గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రచారానికే ఆయన పరిమితం అవుతున్నారు. హైదరాబాద్‌ దాటి...మిగతా జిల్లాల్లో ఎక్కువగా పర్యటించడం లేదు. అప్పుడప్పుడు ప్రెస్‌మీట్లు తప్పా తెలంగాణ వ్యాప్తంగా ఒంటరిగా భారీ బహిరంగ సభలను నిర్వర్తించలేకపోతున్నారు కిషన్ రెడ్డి.

కిషన్ రెడ్డి. తెలంగాణ బీజేపీ చీఫ్. కమలదళానికి రథ సారధి. కానీ ఎన్నికల ప్రచారంలో ఆ పాత్రను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను సీరియస్‌గా తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో కమలం పార్టీని ముందుండి నడిపించడం లేదని, ఆయన ఒక్క హైదరాబాద్ బీజేపీకే అధ్యక్షుడా లేక రాష్ట్రం మొత్తానికి అధ్యక్షుడా అంటూ సొంత కేడరే అసంమ్మతి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్, రేవంత్‌ రెడ్డిలా.

గెలుపు బాధ్యతలను ఎందుకు భూజాల మీదకు ఎత్తుకోవడం లేదని, వారిలా రాష్ట్రం మొత్తం ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ మేనిఫెస్టోను జనాల్లోకి తీసుకెళ్లడంలోనూ ఆయన విఫలం అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కనీసం బండి, ఈటల అయినా మిగతా నియోజకవర్గాలకు వెళ్తున్నారు తప్పా.. కిషన్ రెడ్డి మాత్రం పార్టీ అధ్యక్షుడు అయ్యి ఉండి... ఇలా గ్రేటర్ హైదరాబాద్‌ను దాటకపోవడం ఏంటని సొంత పార్టీ అభ్యర్థులే నిలదీస్తున్నారు.

బండి సంజయ్ చీఫ్‌గా ఉన్నప్పుడు బీజేపీ చాలా దూకుడుగా వెళ్లింది. బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నంతగా పుంజుకుంది. కానీ బండి సంజయ్‌ మార్పు తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన కిషన్‌రెడ్డి..ఆ వేవ్‌ను కంటీన్యూ చేయలేకపోయారు. పార్టీ కార్యక్రమాల్లో వేగం తగ్గింది. ఫలితంగా ఎన్నికల నాటికి బీజేపీ గ్రాఫ్ పడిపోయి కాంగ్రెస్‌ రేసులోకి వచ్చింది. కనీసం బీజేపీ గెలిచే స్థానాలపైనా కిషన్‌రెడ్డి ఫోకస్ పెట్టడం లేదని, వారి గెలుపు కోసం ప్రచారం చేయకపోవడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. పార్టీ చీఫ్‌గా విఫలం అవుతున్నారని సొంత కేడరే మండిపడుతున్నారు.

Tags:    

Similar News