Rain Alert: నేడు ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన..హైదరాబాద్ లో మారిన వాతావరణ పరిస్థితులు

Rain Alert:బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఒక్కసారిగా వాతావరణంలో పరిస్థితులు మారిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.

Update: 2024-09-20 01:21 GMT

Cyclone Dana: దానా సైక్లోన్ దారెటు?

Rain Alert: బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఒక్కసారిగా వాతావరణంలో పరిస్థితులు మారిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి సాధారణంగా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉదయం నుంచి రాత్రి వరకు తెలంగాణ, కోస్తా, ఉత్తరాంధ్రలో మేఘాలు కమ్ముకుని ఉంటాయి. రాయలసీమలో ఎండ కొడుతుంది. అయితే సాయంత్రం 4 తర్వాత నుంచి సీమలో మేఘాలు కమ్ముకుంటాయి.

మధ్యాహ్నం 12గంటల నుంచి ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలో వర్షాలు కురుస్తాయి. ఇవి తేలికపాటి నుంచి మోస్తరుగా..అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. సాయంత్రం 3 తర్వాత నుంచి కోస్తాలో కూడా వర్షలు కురిసే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు అంతటా ఒకే విధంగా ఉండవని తెలిపింది.

కాగా శుక్రవారం ఉదయం హైదరాబాద్ వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గురువారం మధ్యాహ్నం భారీ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. జనం ఉక్కపోతకు గురయ్యారు. కానీ శుక్రవారం అర్థరాత్రి నుంచి వాతావరణ పరిస్థితులు మారాయి. ఆకాశం మేఘావ్రుతం అయి ఉంది. తేమతో కూడి ఉంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News