CM KCR: ప్రభుత్వం న్యాయశాఖకు పెద్దపీట వేస్తోంది
CM KCR: జిల్లా కోర్టులకు నూతన భవనాలను ఏర్పాటు చేస్తాం
CM KCR: తెలంగాణ ప్రభుత్వం న్యాయశాఖకు పెద్దపీట వేస్తోందన్నారు సీఎం కేసీఆర్. జిల్లా కోర్టులకు నూతన భవనాలను ఏర్పాటు చేస్తామన్నారు. 1730 అడిషనల్ పోస్టులు మంజూరు చేస్తామని.. ఇప్పటి వరకు 4348 పోస్టులను మంజూరు చేశామని గుర్తు చేశారు. రాబోయే వారం రోజుల్లో హైకోర్టు న్యాయమూర్తులకు భవనాలు నిర్మిస్తున్నామన్నారు. న్యాయశాఖలో డిస్పోసల్ ల్యాండ్స్‌ను వెంటనే పరిష్కరించాలని న్యాయమూర్తులను కోరుతున్నామన్నారు సీఎం కేసీఆర్.