PM Modi: కొత్త పార్లమెంట్‌ భవన్‌లో అంబేద్కర్‌ ఫొటో పెట్టాం

PM Modi: ఆదివాసి మహిళను రాష్ట్రపతిని చేస్తే కాంగ్రెస్‌ వ్యతిరేకించింది

Update: 2023-11-12 06:12 GMT

PM Modi: కొత్త పార్లమెంట్‌ భవన్‌లో అంబేద్కర్‌ ఫొటో పెట్టాం

PM Modi: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన దళితుల మహాసభకు ప్రధాని మోడీ హాజరైయ్యారు. ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని మోడీ తెలిపారు. 30 ఏళ్ల మాదిగల పోరాటాన్ని గుర్తించామన్నారు. త్వరలో ఎస్సీ వర్గీకరణపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇటు కేసీఆర్‌పై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ దళితులను మోసం చేశారని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని.. దళితబంధుతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకే లాభం జరిగిందని విమర్శలు గుప్పించారు. ఇదే వేదికపై కాంగ్రెస్ పార్టీని కూడా ప్రధాని మోడీ టార్గెట్ చేశారు. కాంగ్రెస్‌ వల్లే అంబేద్కర్‌కు భారతరత్న ఆలస్యమైందని దుయ్యబట్టారు. దళితుడిని రాష్ట్రపతిని చేస్తే కాంగ్రెస్‌ అవమానించిందని.. ఆదివాసి మహిళను రాష్ట్రపతిని చేస్తే కాంగ్రెస్‌ వ్యతిరేకించిందని గుర్తుచేశారు.

Tags:    

Similar News