Hyderabad Water: హైదరాబాద్ మహానగరంలో 4,5 తేదీల్లో నీళ్లు బంద్
- Hyderabad: హైదరాబాద్ మహానగరానికి తాగునీటి కష్టాలు వచ్చాయి. ఈనెల 4, 5వ తేదీల్లో తాగునీరు బంద్ కానుంది.
- మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3,4 ఫేజ్ లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్ స్టేషన్లలో టీజీ ట్రాన్స్ కో అధికారులు మరమ్మత్తులు చేపడుతున్నారు.
Hyderabad Water: హైదరాబాద్ మహానగరానికి తాగునీరు బంద్ కానుంది. ఈనెల 4, 5 తేదీల్లో తాగునీరు బంద్ కానున్నట్లు అధికారులు తెలిపారు. నగరానికి తాగునీరు సరఫరా చేసే 3,4 ఫేజ్ లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్ స్టేషన్లలో టీజీ ట్రాన్స్ కో అధికారులు మరమ్మత్తులు చేపడుతున్నారు. దీంతో గురువారం ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు 5వ తేదీ శుక్రవారం ఉదయం 7 వరకు ఈ పనులు జరుగుతాయి.
24గంటల పాటు పలు రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు వెల్లడించారు. షేక్ పటే, భోజగుట్ట రిజర్వాయర్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, బోరబండ, బంజారాహిల్స్, ఎర్రగడ్డ, మూసాపేట, కేపీహెచ్ బీ, నల్లగండ్ల, చందానగర్, హుడా కాలనీ, హఫీజ్ పేట, మణికొండ, నార్సింగి వంటి ప్రాంతాల్లో నీటి అంతరాయం వాటిల్లుతుందని తెలిపారు.