Uttam Kumar Reddy: దేశానికి రాహుల్.. ప్రధాని కాబోతున్నారు
Uttam Kumar Reddy: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
Uttam Kumar Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఘంటాపధంగా చెప్పారు ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాట్‌కామెంట్స్ చేశారు ఉత్తమ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 12 స్థానాలు కాంగ్రెస్ గెలవబోతోందని జోస్యం చెప్పారు. అంతేకాకుండా.. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, దేశానికి రాహుల్.. ప్రధాని కాబోతున్నారని చెప్పారు ఉత్తమ్.