Uttam Kumar Reddy: రుణమాఫీ చేస్తామని చెప్పి కేసీఆర్ రైతులను మోసం చేశారు

Uttam Kumar Reddy: కాంగ్రెస్‌లో చేరిన కోదాడ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భాషబోయిన భాస్కర్ రావు

Update: 2023-11-07 14:01 GMT

Uttam Kumar Reddy: రుణమాఫీ చేస్తామని చెప్పి కేసీఆర్ రైతులను మోసం చేశారు

Uttam Kumar Reddy: రుణమాఫీ చేస్తామని చెప్పి సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అన్ని వర్గాల నుంచి బీఆర్ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, డిసెంబర్ తర్వాత తెలంగాణలో ఏర్పడబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భాషబోయిన భాస్కర్ రావు తన అనుచరులతో కలిసి ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. తాను రైతుబంధు ఆపాలని చెప్పినట్టు కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతు బంధు ఆపాలని తాను ఎవరికి, ఎక్కడా చెప్పలేదన్నారు.

Tags:    

Similar News