Ugadi 2024: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఉగాది వేడుకలు
Ugadi 2024: శ్రీ క్రోధి నామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న ప్రజలు
Ugadi 2024: తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకొనేందుకు తెలుగు ప్రజలు సిద్ధమయ్యారు. శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. కొత్త ఏడాదిలో తమకు అంతా శుభం కలగాలని కోరుకుంటున్నారు. ఆలయాల్లో పూజలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రాశి ఫలాలు, పంచాంగ శ్రవణాలు వినేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఉగాది వేడుకల పూజా సామాగ్రి కొనుగోలుతో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి.
షడ్రుచుల ఉగాది పచ్చడికి అవసరమైన మామిడికాయలు, వేపపువ్వు, బెల్లం తదితర సామగ్రి కొనుగోలుదారులతో మార్కెట్‌లు సందడిగా కనిపించాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా మార్కెట్ ఏరియాలన్నీ పూల అంగళ్లు జనంతో కిటకిటలాడాయి. పండుగ సందర్భంగా పూల కొనుగోళ్లకు డిమాండ్ కావడంతో అధిక ధరలు పలికాయి.