తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(TS ICET-2020) కీ విడుదలైంది. సెషన్ల వారీగా నిర్వహించిన పరీక్ష పేపర్లు, వాటికి సంబంధించిన సమాధానాలను TS ICET కి సంబంధించిన వెబ్ సైట్ లో పొందుపరిచారు. పరీక్ష రాసిన విద్యార్థులు https://icet.tsche.ac.in వెబ్ సైట్ లో వారి ఫలితాలను చూసుకోవాలని తెలిపారు. విద్యార్ధులకు కీ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే వారు ఈ నెల 10 వ తేదీలోగా convenertsicet2020@gmail.com మెయిల్ కు పంపించాలని అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే అభ్యంతరాలు పంపించేవారు విద్యార్ధులు కొన్ని నియమాలను తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలను విద్యార్ధులు తెలుసుకోవాలనుకుంటే దానికోసం ఈ Direct Link పై క్లిక్ చేయండి. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు తెలంగాణలోని పలు యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది.
ఇక పోతే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 1 వరకు జరిగిన TS ICET పరీక్షలను ఈ సారి కాకతీయ యూనివర్సిటీ నిర్వహించింది. అయితే ఈ పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 70 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసారు అధికారులు. కాగా ఈ ఏడాది టీఎస్ ఐసెట్ పరీక్షకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మొత్తం 58,452 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.