రామ‌గుండంలో కేంద్ర‌మంత్రుల‌కు నిర‌స‌న సెగ‌

Update: 2020-09-12 08:35 GMT

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎరువుల కార్మాగారాన్ని సందర్శించడానికి వచ్చిన కేంద్ర మంత్రులకు షాక్ త‌గిలింది. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ ఆర్ఎఫ్‌సిఎల్ ప్లాంటు ఎదుట ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎంపీ వెంకటేష్ నేత ధ‌ర్నాకు దిగారు. స్థానికులకు ఉపాధి కల్పించకుండా ఉద్యోగాలను అమ్మకుంటున్నారని ఆరోపించారు. వారికి నచ్చజెప్పేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.

మంత్రులు కిషన్‌రెడ్డి, మాన్‌ సుఖ్‌ లక్ష్మణ్‌భాయి నిరసనకారుల వద్దకు వెళ్లగానే ఆందోళన మరింతగా పెరిగింది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కేంద్రమంత్రులు ఎరువుల కర్మాగారం పరిశీలనకు వెళ్లారు. అయితే అధికారుల‌తో మాట్లాడి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు పునరావాసం కల్పిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇవ్వడంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది.



Tags:    

Similar News