Rain Update: తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన..అక్కడ కుండపోత
Rain Update: తెలుగు రాష్ట్రాల్లో సోమవారం అక్కడక్కడ వర్షాలు కురిసాయి.అనుకున్న స్థాయిలో పడలేడు. నేడు మంగళవారం మాత్రం తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అన్నట్లుగానే హైదరాబాద్ నగరంలో తెల్లవారుజామునుంచే వర్షం కురుస్తోంది. మరి తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
Rain Update: ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం...తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉంది. సోమవారం రాత్రి రాయలసీమలో వర్ష కురిసింది. అయితే ఉదయం హైదరాబాద్ తోపాటు ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురుస్తోంది. ఉదయం 11 గంటల తర్వాత రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటోంది. సాయంత్రం 4 తర్వాత మళ్లీ అక్కడక్కడ చినుకులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సాయంత్రం 5 తర్వాత హైదరాబాద్, మధ్య తెలంగాణ, తిరుమలలో వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రం 9తర్వాత రాయలసీ మధ్య తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వాన పడే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత రాయలసీమలో సోమవారం అర్ధరాత్రి తర్వాత మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని..జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అటు దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. పశ్చిమ హిమాలయ ప్రాంతాలు, ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.