యాదాద్రి భువనగిరి జిల్లా ఎక్స్ ఫ్లోజివ్స్ ఫ్యాక్టరీలో పేలుడు: ఒకరి మృతి, ఎనిమిది మందికి గాయాలు

Yadagirigutta: యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ఫ్లోజివ్స్ ఫ్యాక్టరీలో శనివారం పేలుడు జరిగింది.

Update: 2025-01-04 06:00 GMT

యాదాద్రి భువనగిరి జిల్లా ఎక్స్ ఫ్లోజివ్స్ ఫ్యాక్టరీలో పేలుడు

Yadagirigutta: యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ఫ్లోజివ్స్ ఫ్యాక్టరీలో శనివారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ప్రకాష్ అనే ఒక కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆయనను హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.మరణించిన కార్మికుడిని కనకయ్యగా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన కార్మికులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో షిఫ్ట్ లో 18 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. పేలుడు జరిగిన సమయం కార్మికులు అల్పాహారం చేసే సమయం. దీంతో కార్మికులంతా బయటకు వచ్చారు.దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

పేలుడు జరిగిన బ్లాక్ లో ప్రకాష్, కనకయ్యతో పాటు మరో ఇద్దరు పనిచేస్తున్నారు. ఈ బ్లాక్ లో తొలుత ఫైర్ ప్రారంభమైంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీలో పనిచేసే వారిని బయటకు పంపారు. పోలీసులు కంపెనీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని వారు చెబుతున్నారు.

Tags:    

Similar News