ఈరోజు తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్

* 15 లోపు ఇంటర్ పరీక్షలు పూర్తి * షెడ్యూల్‌ను విడుదల చేయనున్న ఇంటర్ బోర్డు * విద్యాశాఖ ఉన్నతాధికారులతో సబితాఇంద్రారెడ్డి సమీక్ష

Update: 2021-01-28 03:00 GMT

Representational Image

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈ ఏడాది కరోనా కారణంగా అకాడమిక్ ఇయర్ పూర్తిగా స్తంభించింది. దాంతో ఆన్‌లైన్‌లోనే క్లాస్‌లు జరిగాయి. దాంతో ఇవాళ ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. మే 15వ తేదీలోపు పరీక్షలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

మరోవైపు ఇప్పటికే సిలబస్ 70శాతం పూర్తయిందన్నారు. పదోతరగతి పరీక్షలు మే 17 నుంచి నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయి అంతేకాదు కోవిడ్ నేపథ్యంలో ఈ సారి పదోతరగతిలో ఆరు పేపర్స్ ఉండేలా చూస్తామన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసినట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఇంటర్ సెకెండ్ ఇయర్ విద్యార్థులకు క్లాస్‌లతో పాటే ప్రాక్టికల్స్ నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ప్రతి కాలేజీలో ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాలేజీల కోసం జారీ చేసిన మార్గదర్శకాల్లో ఇంటర్ బోర్డు స్వల్పమార్పులు చేసింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాలేజీలను నిర్వహించాలని ఆదేశించింది. ఒక రోజు ఫస్టియర్‌వారికి, రెండో రోజు సెకండియర్‌ వారికి తరగతులు నిర్వహించాలని తెలిపింది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి, గదులు సర్దుబాటు కాకుంటే రెండు షిఫ్ట్‌ల్లో నడుపుకోవచ్చని సూచించింది. 

Full View


Tags:    

Similar News