BRS: ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

BRS: ఉద్యమ పార్టీనుంచి జాతీయ పార్టీగా అడుగులు

Update: 2023-04-27 01:59 GMT

BRS: ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

BRS: భారత రాష్ట్ర సమితి ఇవాళ పార్టీ ఆవిర్భావోత్సవానికి సిద్ధమైంది. ఉద్యమపార్టీగా పురుడు పోసుకుని 22 యేళ్లు పూర్తి చేసుకుంది. 23 యేటా అడుగు పెట్టబోతోంది. రాజకీయ ప్రస్థానంలో అడుగడుగునా అవాంతరాలు అధిగమించి.. జాతీయ పార్టీగా ఎదిగే క్రమంలో నిర్వహించుకునే పార్టీ ఆవిర్భావోత్సవం ప్రతిష్టాత్మకంగా నిలిచింది. తెలంగాణ భవన్ లో ఇవాళ మధ్యాహ్నం బిఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం జరగనుంది. ఈసారి పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని భావించినప్పటికి దాన్ని రద్దు చేసి తెలంగాణ భవన్ లో జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీనేతల్లోనూ... పార్టీ శ్రేణుల్లోనూ సమరోత్సాహం నెలకొంది.

Tags:    

Similar News