New Ration Cards in Telangana: నేడు రేషన్ కార్డుల విధివిధానాలు విడుదల..పూర్తి వివరాలివే

New Ration Cards in Telangana: కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామని తెలిపింది. దీనిపై కీలక అప్ డేట్ తెలుసుకుందాం.

Update: 2024-09-21 06:17 GMT

 New Ration Cards: నేడు రేషన్ కార్డుల విధివిధానాలు విడుదల..పూర్తి వివరాలివే

New Ration Cards in Telangana: కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామని తెలిపింది. దీనిపై కీలక అప్ డేట్ తెలుసుకుందాం.

కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. చాలా పథకాల అమలు విషయంలో రేషన్ కార్డులను ప్రభుత్వం ఆధారంగా చూపుతోంది. అందువల్ల కొత్త రేషన్ కార్డులకోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటివరకు చాలా మంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొత్త రేష్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఇప్పటికీ కూడా రేషన్ కార్డులు రాలేదు. అయితే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలను ఇవాళ విడుదల చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు వాటి ప్రకారం..అవసరం అయితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అక్టోబర్ 2న గాంధీ జయంతి ఉంది. ఆరోజు నుంచి దరఖాస్తులు తీసుకునేవిధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో జరిగిన రివ్యూ మీటింగులో సూచించారు. కొత్త రేషన్ కార్డుల సంగతి చూసేందుకు ప్రభుత్వం ఆ మధ్య మంత్రివర్గ సబ్ కమిటీని వేసింది.

ఈ కమిటీ చాలా మంది నిపుణులతో మాట్లాడి చర్చలు జరిగి..మొత్తానికి విధి విధానాలను తయారు చేసినట్లు తెలిపింది. నిన్నటి మంత్రివర్గ సమావేశంలో కూడా దీనిపై చర్చ జరిగినట్లు సమాచారం. అందుకే నేడు ఫైనల్ గా ఓసారి విధి విధానాలను పరిశీలించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాటిని నేడు విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

కాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 9 నెలలు గడిచింది. తరచుగా నిర్వహిస్తున్న ప్రజా పాలన సదస్సుల్లో ప్రజలు కొత్త రేన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం ఆ దరఖాస్తులను స్వీకరించండం లేదు. విధి విధానాలను విడుదల చేసిన తర్వాతే స్వీకరిస్తామని తెలుపుతోంది.

అందుకే నేడు గైడ్ లైన్స్ విడుదల అయితే..శనివారం నుంచి దరఖాస్తులను స్వీకరించే ఛాన్స్ ఉ:టుంది. అయితే దరఖాస్తులను ఎలా స్వీకరిస్తుందనేది మరో అంశం. ప్రజాపాలనతోనే తీసుకుంటారా లేదా ఆన్ లైన్లో తీసుకుంటారా అనేది తేలాల్సింది. అక్టోబర్ 2 నాటికి పది రోజులు సమయం ఉంది. ఈలోగా ప్రజలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. 

Tags:    

Similar News