Thummala: రాజకీయాల్లో చిన్న కులం.. పెద్ద కులం అంటూ ఏదీ ఉండదు

Thummala: గతంలో నేను పెరిక సంఘం అండతోనే ఎన్నికల్లో గెలిచాను

Update: 2024-01-29 02:33 GMT

Thummala: రాజకీయాల్లో చిన్న కులం.. పెద్ద కులం అంటూ ఏదీ ఉండదు

Thummala: ఏ కులంలో ఉన్నా.. అందరి కులస్థులతో కలసిమెలసి ఉండాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పెరిక పంఘం ఆత్మీయ సమ్మెళనంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. రాజకీయ తొలినాళ్లలో పెరిక సంఘం అండతో తాను ఎన్నికల్లో విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఖైరతాబాద్ సెంటర్లోనే తొలి పెరిక సంఘం భవనం ఉండేదని.. తరువాతే మిగతా అన్నికుల సంఘాలకు భవనాలు వచ్చాయని తెలిపారు. చిన్న కులం పెద్ద కులం అంటూ రాజకీయాల్లో ఉండదని.. ఖమ్మంలోనూ స్థలం చూస్తే.. భవనం కట్టే బాధ్యత తనదేనన్నారు మంత్రి తుమ్మల.

Tags:    

Similar News