Telangana Rain Alert: తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

Telangana Rain Alert: తెలంగాణలో రాగల మూడురోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Update: 2024-09-23 14:00 GMT

 Rain Alert To Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Telangana Rain Alert: తెలంగాణలో రాగల మూడురోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతోకూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ క్రమంలో మంగళవారం నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Tags:    

Similar News