PM Modi: తెలంగాణలో మరోసారి పర్యటించనున్న ప్రధాని
PM Modi: ఈ నెల 25, 26, 27వ తేదీల్లో తెలంగాణలో మోడీ పర్యటన
PM Modi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రధాని మోడీ తెలంగాణలో మరోసారి పర్యటించనున్నారు. ఈ నెల 25, 26, 27వ తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. 25న కరీంనగర్ లో జనగర్జన సభ, 26న నిర్మల్ జనగర్జన సభ, 27న హైదరాబాద్ లో ప్రధాని మోడీ భారీ రోడ్ షో నిర్వహించనున్నారు.