High Court-Hydra: హైడ్రా కమిషనర్‎కు హైకోర్టు దిమ్మతిరిగే షాక్..తమాషాగా ఉందా అంటూ ఫైర్

High Court-Hydra:హైదరాబాద్ లో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. మూసీ పరివాహాక ప్రాంతంలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. ఇప్పటికే చెరువులు, బఫర్ జోన్స్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ఇళ్లను హైడ్రా కూల్చుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ కు తెలంగాణ హైకోర్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. తమాషాగా ఉందా అంటూ హైడ్రాపై ఫైర్ అయ్యింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం.

Update: 2024-09-28 02:12 GMT

High Court-Hydra: తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా..విన్నా హైడ్రా గురించే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చెరువులు, బఫర్ జోన్స్, ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టినవారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎందుకంటే ఆ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారిని కూడా వదలడం లేదు. ఆ నిర్మాణాలన్నీ నేలమట్టం చేసి నోటీసులు జారీ చేస్తోంది.

 హైడ్రా కు ప్రత్యేక పోలీసులు కూడా కేటాయించారని తెలుస్తోంది. హైడ్రాకు ప్రత్యేక అధికారులు, సిబ్బందిని కూడా కేటాయించారు. సినీనటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత హైడ్రాపై కొందరు ప్రశంసలు కురిపించారు. . ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంపై ప్రతాపం చూపుతోంది.

శని, ఆదివారాల్లో హైడ్రా చేస్తున్న రచ్చ మూములుగా లేదనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో హైడ్రాను కొందరు స్వాగతిస్తుంటే మరికొంతమంది మాత్రం తిట్టిపోస్తున్నారు. కేవలం పేదల మీద హైడ్రా జూలం చూపిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు డబ్బున్న వాళ్లకు నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారని..కేవలం పేదలను టార్గెట్ చేసి వారిని ఇబ్బంది పెడుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ఎంతో కష్టపడి పైసా పైసా పోగు చేసిన కట్టుకున్న ఇళ్లను కళ్ల ముందే కూల్చివేస్తామంటే ఎలా ఊరుకుంటామంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ప్రస్తుతం హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

అయితే అమీన్ పూర్ లో ఈమధ్య ఓ భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే అది కోర్టు పరిధిలో కేసు పెండింగ్ లోనే ఉంది. బాధితులు కూడా ఇదే విషయాన్ని హైడ్రాకు చెప్పారని సమాచారం. కానీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఆ భవనాన్ని నెలమట్టం చేయడం బాధితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు హైడ్రా రంగానాథ్ పై ఫైర్ అయ్యింది. కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనిపై వెంటనే వచ్చే సోమవారం నాడు వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా కోర్టు ఎదుట హాజరవ్వాలని నోటీసులు జారీ చేసింది. మరోవైపు తెలంగాణలో మూసీ నది, చైతన్యపురి పలు ప్రాంతాల్లో కూడా హైడ్రా కూల్చివేతలు చేస్తామంటూ మార్కులు పెట్టారు అధికారులు. ఇప్పుడు తమ ఇండ్లన కూలగొడితే ఎక్కడికి వెళ్లాలంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు బాధితులు. అంతేకాదు ముఖ్యమంత్రిని బండబూతులు తిడుతూ శాపనార్థాలు పెడుతున్నారు. 

Tags:    

Similar News