Etela Rajender: ప్రభుత్వం ఇచ్చినమాట ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
Etela Rajender: స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేస్తేనే.. నాయకులు వస్తారు
Etela Rajender:స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. జేబీస్ దగ్గర కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ 131వ జయంతి ఉత్సావాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో ముదిరాజులు వెనకబడి ఉన్నారని, ఎన్నికలలో దామాషా ప్రకారం సీట్లు కేటాయించినపుడే చట్టసభల్లో తగిన న్యాయం జరుగుతుందని ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ తొలి మేయర్‌గా కృష్ణస్వామి సేవలు అందించారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ముదిరాజులు రాజకీయంగా ఎదిగినప్పుడే న్యాయం జరుగుతుందన్నారు.