ఘనంగా కాకతీయుల వైభవ సప్తాహం ప్రారంభం
Warangal: *వారం రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు
Warangal: కాకతీయుల వైభవ సప్తాహం ఘనంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు వారం పాటు జరగనున్నాయి. ముఖ్య అతిథిగా కాకతీయుల 22వ వారసుడు కమల్‌చంద్ర భంజ్ దేవ్ హాజరయ్యారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ కమల్‌చంద్రకు స్వాగతం పలికారు. పడమర కోట ద్వారం నుంచి వేద పండితులు మంత్రాలతో ఆయనకు స్వాగతం పలికారు. మధ్యకోట మీదుగా వెళ్లి కాకతీయుల నాటి పురాతన ఆలయం స్వయంభూ శ్రీ శంభులింగేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
కాకతీయ వైభవోత్సవాల్లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని కమల్ చంద్ర తెలిపారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఆయన కాకతీయ వైభవోత్సవాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పూర్వీకులు సామాజిక సేవలో భాగంగా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునే క్రమంలో చెరువులను తవ్వించి, వ్యవసాయ రంగాభివృద్ధికి పెద్దపీట వేశారనే విషయాన్ని గుర్తు చేశారు.