Revanth Reddy: ఫేక్ వీడియో కేసును లీగల్‌గా ఫేస్ చేయాలనే యోచనలో సీఎం
Revanth Reddy: విచారణకు ఢిల్లీ వెళ్లొద్దని సీఎం రేవంత్ నిర్ణయం
Revanth Reddy: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విచారణకు ఢిల్లీ వెళ్లొద్దని సీఎం రేవంత్ రెడ్డి డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో న్యాయపరంగా ముందుకెళ్లే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్‌కు ఇటీవల సమన్లు జారీ చేయగా నేడు విచారణకు హాజరుకావాల్సి ఉంది. కాగా ఎన్నికల దృష్ట్యా విచారణకు వెళ్లొద్దని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ కేసులో ఎఫ్ఐఆర్‌ను పరిశీలించేందుకు సమయం కోరుతూ..ఢిల్లీ పోలీసులకు టీపీసీసీ లీగల్ టీమ్ లేఖ రాసింది.