TG DSC: డిసెంబర్ లో టెట్, ఫిబ్రవరిలో మరో డీఎస్సీ..రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

TG DSC: త్వరలోనే మరో డీఎస్సీ నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు వార్తలువస్తున్నాయి. 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రభుత్వ పాఠశాలల్లో 6వేలకు పైగా పోస్టుల భర్తీకి కొత్త టీచర్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Update: 2024-07-17 03:22 GMT

TG DSC: డిసెంబర్ లో టెట్, ఫిబ్రవరిలో మరో డీఎస్సీ..రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

TG DSC:తెలంగాణలోని డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్. మరో డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధమైంది రేవంత్ రెడ్డి సర్కార్. ప్రస్తుతం 11వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షను షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి (గురువారం జులై 18) నుంచి ఆగస్టు 5 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అయితే త్వరలోనే మరో డీఎస్సీ నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు వార్తలువస్తున్నాయి. 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రభుత్వ పాఠశాలల్లో 6వేలకు పైగా పోస్టుల భర్తీకి కొత్త టీచర్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు ఈ గుడ్ న్యూస్ అందించారు. తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని..అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాల కల్పనపై ఫోకస్ పెట్టిందని చెప్పారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. డీఎస్సీ ఆలస్యం అయితే మరింత నష్టం జరగుతుందని భట్టి అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థపై ఫోకస్ పెడితే 16వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిసిందన్నారు. అందుకే త్వరగా విద్యాశాఖలో సమస్యలపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. డీఎస్సీ కోసం చాలా కాలం నుంచి అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారని అభ్యర్థులు ఈ పరీక్షలు మంచిగా రాయాలన్నారు. ఇందులో ఎంపిక అయ్యేవాళ్లు అవుతారు..ఇంకొందరికి మళ్లీ కొన్ని నెలల తర్వాత మరో డీఎస్సీ వస్తుందని భట్టి చెప్పారు.

డిప్యూటీ సీఎం హామీ మేకు త్వరలోనే మరో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 2025 జనవరి లేదా ఫిబ్రవరి లో ప్రభుత్వ పాఠశాలలో 6వేల టీచర్ పోస్టుల భర్తీకి కొత్త టీచర్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ముందుగానే టెట్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలోనే 2024 డిసెంబర్ లో టెట్ నిర్వహించి 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో డీఎస్సీ ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News