Rains Alert: తెలంగాణలో నేడు భారీ వర్షం? వాతావరణశాఖ ఏం చెబుతోంది?
Rains Alert: తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు ముఖ్య సమాచారం ఇచ్చారు. రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాలకు అవకాశం లేకపోయినా..పలు ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.
Rains Alert: తెలంగాణలో గతకొన్ని రోజులుగా విచిత్ర వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు దంచికొడుతుంటే..మరోవైపు పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సాయంత్రానికి ఉన్నట్లుండి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వస్తున్నాయి. తెల్లవారుజామున విపరీతమైన చలి ఉంటుంది.
ఉష్ణోగ్రతలు పడిపోతుంటుంటే..రాష్ట్రంలో నేడు పలు చోట్లు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
దానా తుపాన్ ముప్పు లేనప్పటికీ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జల్లులకు మాత్రమే అవకాశం ఉందన్నారు. ఇక హైదరాబాద్ వాతావరణం పొడిగా ఉంటుందన్నారు. ఉదయం చలిగా, మధ్యాహ్నం ఎండ ఉంటుందని వెల్లడించారు.
సాయంత్రానికి వాతావరణం పూర్తిగా చల్లబడి కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక గత రెండు రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పగలు ఎండ కాసినా..సాయంత్రానికి వాతావరణం చల్లబడి చలిగాలులు వీస్తున్నాయి. రానున్న వారం రోజులు రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
చలిగాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వెచ్చటి కాటన్, ఉన్ని దుస్తులు ధరించాలని చెబుతున్నారు. బయటకు వెళ్తే స్వెట్టర్లు, మఫ్లర్ లు ధరించాలని..గదిలో టెంపరేచర్ తగ్గకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.