చంచల్ గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల

చంచల్ గూడ జైలు నుంచి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శుక్రవారం విడుదలయ్యారు. షరతులతో తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 24న ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

Update: 2024-10-25 12:00 GMT

చంచల్ గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల

చంచల్ గూడ జైలు నుంచి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శుక్రవారం విడుదలయ్యారు. షరతులతో తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 24న ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలను జైలు అధికారులకు అందించడంతో ఆయనను విడుదల చేశారు. మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే కేసులో ఆయనను నార్సింగి పోలీసులు ఈ ఏడాది సెప్టెంబర్ 19న గోవాలో అరెస్ట్ చేశారు. 36 రోజుల తర్వాత జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.

జానీ మాస్టర్ వద్ద పనిచేసిన మహిళ కొరియోగ్రాఫర్ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు ఈ కేసును బదిలీ చేశారు. ఈ ఫిర్యాదు విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ పోలీసులకు చిక్కలేదు.

గోవాలోని ఓ హోటల్ లో ఉన్న ఆయనను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో జానీ మాస్టర్ ను నాలుగు రోజులపాటు పోలీసులు ఆయనను విచారించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఫిలిం ఛాంబర్ విచారిస్తోంది.

Tags:    

Similar News