Rythu Bharosa Scheme: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. రైతు భరోసా, రేషన్ కార్డులపై కీలక నిర్ణయాలకు అవకాశం..!
Telangana Cabinet: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది.
Telangana Cabinet: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డుకు సన్న బియ్యంతో పాటు ఇందిరమ్మ ఇళ్లపై కూడా క్యాబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు జరిగే కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసాపై క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రైతు పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది.
ఇక రైతు భరోసాలో ఏదైనా కటాప్ ఉంటుందా... లేక ఇతర నిబంధనలపై రేపు చర్చ జరిగిన అనంతరం ఓ క్లారిటీ రానుంది. ఇప్పటికే రైతు భరోసాపై సబ్ కమిటీ పలు ధపాలుగా జిల్లాల్లో పర్యటించి సచివాలయంలో సమీక్షలు జరిపారు. సబ్ కమిటీ తుది నివేదిక క్యాబినెట్ ముందుకు రానుంది. మరోవైపు బీసీ కులగణనపై రిపోర్ట్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ లో చర్చ జరుగనుంది. దీంతో పాటు కౌలు రైతులకు డబ్బులు రైతు కూలీలకు డబ్బులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.