Telangana: వాళ్ళు కాంగ్రెస్ పార్టీపై ప్రేమతో రాలేదు... ఫిరాయింపులపై మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు
Madhu Yashki: కాంగ్రెస్‌లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ హీట్ రేపుతున్న వేళ,.. సీనియర్ నేత మధుయాష్కీ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Madhu Yashki: కాంగ్రెస్‌లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ హీట్ రేపుతున్న వేళ,.. సీనియర్ నేత మధుయాష్కీ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై మధుయాష్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ పాలసీలు నచ్చి రాలేదని హాట్ కామెంట్స్ చేశారు. వారి అక్రమాస్తులు కాపాడుకునేందుకు, రాజకీయ భవిష్యత్ కాపాడుకునేందుకు మాత్రమే కాంగ్రెస్‌లో చేరారని.. కాంగ్రెస్‌పై ప్రేమతో కాదన్నారు మధుయాష్కీ. ఎమ్మెల్యేలు చేరిన చోటల్లా వారికి పార్టీని రాసివ్వలేదన్నారు.
జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో గంగారెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ లక్ష్మణ్ తో కలిసి పరామర్శించారు మధుయాష్కి. అనంతరం మధుయాష్కీ మాట్లాడుతూ… గంగారెడ్డి అతి దారుణంగా హత్యకి గురికావడం బాధకరమన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొన్న వ్యక్తి గంగారెడ్డి అని… తనకి ప్రాణహాని ఉందని పోలీసులకి చెప్పుకున్నారని వెల్లడించారు. ప్రాణానికి ముప్పు ఉందని చెప్పిన పోలిసులు ఎందుకు పట్టించుకోలేదని ఆగ్రహించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లో కాంగ్రెస్ నాయకులు హత్య గురి కావడం బాధకరం అన్నారు. ఎవరి ప్రోద్భలంతో, ఎవరి అండతో పోలిసులు వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపాడుకోవాల్సిన అవసరం మాపై ఉందని తెలిపారు. 2014 లో ఉమ్మడి జిల్లా నుండి ఒక్కరే జీవన్ రెడ్డి గెలిచారని…బీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలు పెట్టిన బీఆర్ఎస్ లోకి వెళ్ళలేదని గుర్తు చేశారు.