ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌ సీనియర్ల మద్దతు

Jeevan Reddy: జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ఆ పార్టీ సీనియర్‌ నేతల నుంచి మద్దతు పెరుగుతోంది.

Update: 2024-10-26 05:59 GMT
Congress Senior Leader Madhu Yashki Meeting With MLC Jeevan Reddy

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌ సీనియర్ల మద్దతు

  • whatsapp icon

Jeevan Reddy: జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ఆ పార్టీ సీనియర్‌ నేతల నుంచి మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్‌ నేత, జీవన్‌రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్య తరువాత తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు జీవన్‌రెడ్డి. అయితే జగిత్యాలలో జీవన్‌రెడ్డిని కలిసి పరామర్శించారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ. అనుచరుడి హత్యకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని, సానుభూతి వ్యక్తం చేశారు.

40ఏళ్ల రాజకీయ జీవితంలో జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి ఎనలేని సేవ చేశారని, ఆ‍యన సేవలు పార్టీకి మరింత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు ప్రభుత్వ పాలనలో జీవన్‌రెడ్డి తెలిపిన అభ్యంతరాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని మధుయాష్కీ స్పష్టం చేశారు. ఇక కాసేపట్లో జాబితాపూర్‌లో గంగారెడ్డి కుటుంబాన్ని వారిద్దరూ పరామర్శించనున్నారు. అటు నిన్న జీవన్‌రెడ్డికి అనుకూలంగా జగ్గారెడ్డి కూడా స్పందించారు. 

Tags:    

Similar News