DA Hike: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..వచ్చే నెల నుంచి భారీగా జీతాలు పెంపు

DA Hike: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఉద్యోగులకు, రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతోంది. శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Update: 2024-10-26 01:33 GMT

 DA Hike: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..వచ్చే నెల నుంచి భారీగా జీతాలు పెంపు

DA Hike: నేడు తెలంగాణలో మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. ముందుగా ఈనెల 23వ తేదీన జరగాల్సిన కేబినెట్ మీటింగ్ వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశం అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా కొత్త రెవెన్యూ చట్టంపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సాయంత్రం 4గంటల కేబినెట్ మీటింగ్ ప్రారంభం అవుతుంది. మంత్రివర్గ భేటీలో పలు ముఖ్య అంశాలపై చర్చలు జరుగుతాయి. కొత్త చట్టాలు, స్కీంల అమలుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా రైతులు, ఉద్యోగులకు శుభవార్తలు చెప్పేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొని ఉంది.

మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలపై చర్చిస్తారు. కొత్త రెవెన్యూ చట్టం, మూసీ బాధితుల సమస్యలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే వరద నష్టపరిహారంపై కూడా చర్చ ఉంటుంది. సంబంధిత శాఖల అధికారులకు తగిన సూచనలు ఇప్పటికే జారీ చేయగా..ఈ సమావేశం ముగిసిన అనంతరం అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది.

ఇక ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే డీఏ పెంపుపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది. దీపావళి కానుకగా నవంబర్ 1న అక్టోబర్ జీతంతోపాటు డీఏ అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డీఏలను పరిష్కరించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉద్యోగుల కర్తవ్యాలను మరింత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అటు రైతు భరోసా స్కీంపై కూడా మంత్రి వర్గం చర్చించనుంది. పంటలపై మునుపటి రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని నిర్ణయించింది. రూ. 2లక్షలకు మించిన ఉన్న రుణాలను దశలవారీగా మాఫీ చేయాలని నిర్ణయించారు. రైతులకు త్వరలోనే ఆర్థిక భరోసా అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. రైతు భరోసా స్కీం అమలు పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టనిచ్చారు.

Tags:    

Similar News