హీరో అల్లు అర్జున్ పై నమోదైన కేసు మరో మలుపు తిరిగింది.సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి భర్త భాస్కర్ అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు. ఈ తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్ కు సంబంధం లేదన్నారు. కేసును విత్ డ్రా చేసుకుంటానని ఆయన కోరారు.
డిసెంబర్ 4న తన కొడుకు కుమారుడు సినిమా చూస్తానంటే సంథ్య థియేటర్‌కి తీసుకొచ్చానని చెప్పారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగిందని ఆయన తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ గురించి తాను మొబైల్ లో చూశానని ఆయన చెప్పారు.