Allu Arjun: మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

Allu Arjun gets bail: అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Update: 2024-12-13 12:19 GMT

Allu Arjun gets bail: అల్లు అర్జున్  ( Allu Arjun)కు   తెలంగాణ హైకోర్టు (Telangana high court )నాలుగు వారాల మధ్యంతర బెయిల్ (interim bail)మంజూరు చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో  తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత బెయిల్ ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పర్సనల్ బాండ్ తీసుకొని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ ను ఏ 11 గా పోలీసులు రిమాండ్ రిపోర్టులో చెప్పారు. క్వాష్ పిటిషన్ అత్యవసరం కాదని.. సోమవారం వాదనలు వినాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు.

అల్లు అర్జున్ అరెస్టైనందున బెయిల్ కోసం మరో పిటిషన్ వేసుకోవాలని కోరారు.క్వాష్ (quash )పిటిషన్ లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. సినిమా విడుదల సందర్భంగా థియేటర్ కు వెళ్తారని... పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో కు వెళ్లే విషయాన్ని థియేటర్ యాజమాన్యం, నిర్మాత పోలీసులకు సమాచారం ఇచ్చారని అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.

థియేటర్ కు వెళ్లొద్దని పోలీసులు ముందుగానే అల్లు అర్జున్ కు సమాచారం ఇచ్చారని పీపీ కోర్టు దృష్టికి తెచ్చారు. భారీగా జనం ఉన్నారని తెలిసి ఆయన థియేటర్ కు వెళ్లారన్నారు. అయితే పోలీసులకు సమాచారం ఇచ్చినా కూడా తగిన భద్రత ఇవ్వలేదని అల్లు అర్జున్ న్యాయవాది కోర్టుకు తెలిపారు.ఎఫ్ఐఆర్ ను పూర్తిగా కొట్టివేయాలని పిటిషన్ వేశాం.. ఈ పిటిషన్ ను విచారణ సాగుతుండగానే అరెస్ట్ చేసినందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోరారు. గతంలో అర్ణబ్ గోస్వామి, మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో ముంబై కోర్టు ఇచ్చిన తీర్పును అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.  ఈ వాదనలు విన్న తర్వాత అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఆదేశించింది.

రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలన్న కోర్టు

రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కు సూచించింది. తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పూర్తిస్థాయి బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.


Similar News