Telangana News: తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఊరట

Telangana News: కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల ఆందోళనలతో సెలవుల రద్దు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.

Update: 2024-10-25 17:02 GMT

Telangana News: తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఊరట

కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల ఆందోళనలతో సెలవుల రద్దు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్రంలో గతంలో బెటాలియన్ కానిస్టేబుళ్ల 15 రోజులకు ఒకసారి సెలవుపై వేళ్ల అవకాశం ఉండేది. కానీ, ఈ నిబంధనను మార్చారు.

కొత్త లీవ్ మాన్యువల్ ను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కొత్త జీవోను విడుదల చేశారు. దీంతో 15 రోజులకు సెలవుపై వెళ్లాల్సిన కానిస్టేబుళ్లు 26 రోజులకు సెవలుపై వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి.

ఈ నిబంధనను నిరసిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. తొలుత నల్గొండ, ఆ తర్వాత ఆదిలాబాద్ ఇలా వరుసగా పలు జిల్లాల్లో ఆందోళనలు జరిగాయి.

శుక్రవారం తెలంగాణ సెక్రటేరియట్ ను కానిస్టేబుల్ కుటుంబసభ్యులు ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం సెలవుల విషయంలో ఇటీవల జారీ చేసిన జీవోను తాత్కాలికంగా నిలిపివేసింది.

Tags:    

Similar News