Pharma Village: ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన, ఉద్రిక్తత.. కాంగ్రెస్ నాయకుడి నిర్భంధం..

Pharma Village: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రోటిబండతండాలో ఫార్మా భూ రైతుల ఆందోళన శుక్రవారం ఉద్రిక్తతకు దారితీసింది.

Update: 2024-10-25 08:47 GMT

Pharma Village: ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన, ఉద్రిక్తత.. కాంగ్రెస్ నాయకుడి నిర్భంధం..

Pharma Village: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రోటిబండతండాలో ఫార్మా భూ రైతుల ఆందోళన శుక్రవారం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ కారుపై ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. ఆయనను గ్రామపంచాయితీ భవనంలో నిర్భంధించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టారు.

కొందరు రైతులు తమ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు, నిరసనకారుల మధ్య గ్రామపంచాయితీ కార్యాలయం వద్ద తోపులాట జరిగింది. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. స్థానికుల ఆందోళనతో ఫార్మా విలేజ్ లో ప్రజాభిప్రాయసేకరణ వాయిదా పడింది.

Tags:    

Similar News