తెలంగాణ వర్సిటీలో ఇష్టారాజ్యం.. అల్పాహారంలో కప్ప కళేబరం.. పురుగుల భోజనంతో...

Telangana University: వర్సిటిలో పాముల పలకరింపులు,కోతుల బెదిరింపులు...

Update: 2022-04-18 05:06 GMT
Telangana University Food Problems and Hostel Problems | Live News Today

తెలంగాణ వర్సిటీలో ఇష్టారాజ్యం.. అల్పాహారంలో కప్ప కళేబరం.. పురుగుల భోజనంతో...

  • whatsapp icon

Telangana University: తెలంగాణ విశ్వవిద్యాలయం(Telangana University) సమస్యలకు నిలయంగా మారింది. నిజామబాద్(Nizamabad) జిల్లా డిచ్ పల్లిలోని వర్సిటిలో పెట్టిన అల్పాహారంలో కప్ప కళేబరం ప్రత్యక్షం కావడం రాష్ట్ర స్దాయిలో చర్చకు దారి తీసింది. బాలికల వసతి గృహంలో పాముల పలకరింపులు, కోతుల బెదిరింపులతో విద్యార్దినీలు హడలిపోతున్నారు. 85 గదుల్లో 450 మంది విద్యార్ధినీలు వసతి పొందుతూ నరకయాతన పడుతున్నారు.

దీంతో సమస్యలు పరిష్కరించాలంటూ హాస్టల్ స్టూడంట్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. సమస్యలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని వర్సిటీ అధికారులు హామీ ఇచ్చినా ప్రయోజనం లేదని విద్యార్దినీలు(Students) వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి పరిష్కరించాలని డిమాండ్(Demand) చేస్తున్నారు.

Tags:    

Similar News