ట్యాంక్‌బండ్ పై తెలంగాణ ఆర్టీసీ కొత్త బస్సుల ఆవిష్కరణ.. హాజరైన మంత్రి పువ్వడా అజయ్
* 5ఏళ్ల తర్వాత అందుబాటులోకి 51 కొత్త బస్సులు
Telangana: తెలంగాణ ఆర్టీసీలో శుభపరిణామం చోటుచేసుకుంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై TS RTC కొత్త బస్సుల ఆవిష్కరణ జరిగింది. తొలి దశలో ప్రవేశపెట్టే 300 బస్సుల్లో భాగంగా 51 నూతన బస్సులు రోడ్డెక్కాయి. 5 ఏళ్ల తరువాత కొత్తబస్సులు అందుబాటులోకి వచ్చాయని బస్సులు కొనుగోలులో వివిధ బ్యాంకుల సహకారం ఉందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్ తెలిపారు.
తొందరలో మొత్తం మూడు వందల బస్సులు నగరంలో చెక్కర్లు కొడతాయని వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వస్తుందని సజ్జన్నార్ తెలిపారు. రానున్న 5ఏళ్లలో అన్ని ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చనున్నట్లు చెప్పారు. ఆర్టీసీలో నిత్యం 30 నుంచి 35 లక్షల మంది ప్రజలు ప్రయాణిస్తున్నారని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.