Telangana Jobs: తెలంగాణలో మరోసారి పండగ వాతావరణం..మళ్లీ మొదలైన ఉద్యోగాల జాతర

Telangana Jobs: తెలంగాణలో ఉద్యోగాల పండగ షురూ అయ్యింది. ఈ మధ్యే తెలంగాణ సర్కార్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారమే ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు రిలీజ్ చేయనున్నారు.

Update: 2024-09-12 02:25 GMT

Telangana Jobs: తెలంగాణలో మరోసారి పండగ వాతావరణం..మళ్లీ మొదలైన ఉద్యోగాల జాతర

Telangana Jobs: తెలంగాణలో మరోసారి ఉద్యోగాల జాతర షురూ అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యే ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారమే ఉద్యోగులకు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనుంది సర్కార్. ఈనెల 4వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయబోతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ 4వేల ఉద్యోగాలు అన్నీ వైద్య ఆరోగ్య శాఖలోఉన్న ఖాళీ పోస్టులే.

ఇక జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే సెప్టెంబర్ లో ఈ నోటిఫికేషన్ విడుదల చేసి..నవంబర్ లో పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. భర్తీ చేయనున్న పోస్టుల్లో ల్యాబ్ టెక్నీషియన్స్, స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో 2024 స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికీ ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపింది.

అటు తెలంగాణలో కొత్త 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ ఇచ్చింది. యాదాద్రి-భువనగిరి మహేశ్వరం కుత్బుల్లాపూర్, మెదక్ ప్రభుత్వ కాలేజీలకు అనుమతులు ఇస్తూ రాష్ట్ర వైద్య, విద్య డైరెక్టర్ ఎన్ఎంసీకి సమాచారం అందించింది. దీంతో తెలంగాణలో మరో 200 ప్రభుత్వం ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 34కు పెరిగాయి. వీటిలో ఎంబీబీఎష్ సీట్ల సంఖ్య 4,315కి చేరుకుంది.


Tags:    

Similar News