తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదలైంది. ఎలాంటి ఫైన్ లేకుండా నేటి నుంచి (జనవరి 30) ఫిబ్రవరి 11 వరకు ఫీజు చెల్లించవచ్చని రాష్ట్ర విద్యాశాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. రూ.100 రుసుముతో ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు, రూ.500 రుసుముతో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 2 వరకు చెల్లించవచ్చని గడువు ఇచ్చారు. రూ.వెయ్యి ఆలస్య రుసుముతో మార్చి 9 వరకు ఫీజు చెల్లించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు వెసులుబాటు కల్పించింది.